Sunday, November 10, 2024
HomeUncategorizedవేయించిన శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువ..!

వేయించిన శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువ..!

Date:

శనగలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. శెనగలు నానబెట్టిన, వేయించిన శనగలు ఐనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేయించిన శనగలను పుట్నాల పప్పు అని కూడా పిలుస్తూంటారు. వీటిని ఎక్కువగా ప్రయాణాల్లో టైమ్ పాస్ కింద తింటూ ఉంటారు. కొంత మంది నేరుగా తింటే.. మరి కొంత మంది వీటిల్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా దట్టించి తింటారు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అయినా.. బెనిఫిట్స్ మాత్రం ఒకటే. వీటిని కొంత మంది వంటల్లో కూడా యాడ్ చేస్తారు. ఈ పప్పుతో టిఫిన్లలోకి చట్నీ కూడా తయారు చేస్తారు. ఈ పుట్నాల పప్పు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా వీటిని తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. మరి వీటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రోటీన్ మెండుగా ఉంటుంది..

పుట్నాల పప్పులో ప్రోటీన్ అధికంగా లభ్యమవుతుంది. వీటిని చిరుతిండిగా అయినా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రోటీన్ కొరత ఉన్నవారికి ఈ పప్పును స్నాక్‌లా చేసి పెట్టొచ్చు.

ఫైబర్ అధికంగా..

పుట్నాల పప్పులో ఫైబర్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల కడుపుకు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్ధకం, అజీర్తి, కడుపులో నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

వెయిట్ లాస్ అవుతారు..

వేయించిన శనగ పప్పులో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాలు తినే అవకాశం తగ్గుతుంది. ఇలా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి:

పుట్నాల పప్పు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. తక్షణమే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో త్వరగా నీరస పడకుండా ఉంటారు. వీటిల్లో ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, మినరల్స్, విటమిన్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది..

పుట్నాల పప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే ఈ పప్పులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.