Saturday, December 7, 2024
Homeప్రత్యేక కథనాలుమ‌హిళ‌లు.. మీ వ‌య‌స్సు 40దాటిందా... ఐతే ఇది మీ కోసమే..

మ‌హిళ‌లు.. మీ వ‌య‌స్సు 40దాటిందా… ఐతే ఇది మీ కోసమే..

Date:

ప్ర‌తి మ‌నిషికి వ‌య‌సు పెరుగుతున్న కొద్ది కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ఏదో ఒక వ్యాధి బారిన ప‌డుతారు. ముఖ్యంగా వ‌య‌సు పెరుగుతున్న మ‌హిళ‌ల శ‌రీరాల్లో చాలా మార్పులు వ‌స్తుంటాయి. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, B విటమిన్లు శరీరానికి అందాలి.

*కాల్షియం, విటమిన్ D*

వ‌య‌స్సు 40దాటిన మహిళల ఎముకల సాంద్రత సహజంగా తగ్గుతుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ ప్రారంభ దశ కాబట్టి, హార్మోన్ల మార్పులు కామన్. ఈ వ‌య‌స్సులో మహిళలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందులో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ లెవల్స్ తగ్గితే బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఎముకల బలాన్ని పెంచేందుకు కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారాలు తినాలి. అవసరమైతే సప్లిమెంట్స్ వాడాలి.

*ఫైబర్ ఫుడ్స్*

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో మెటబాలిజం తగ్గిపోతుంది. దీంతో వెయిట్ మేనేజ్‌మెంట్ మరింత కష్టమవుతుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ఎందుకంటే పీచు పదార్థాలు ఉండే ఫుడ్స్ తింటే డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్ సాధ్యం అవుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సైతం ఇది తగ్గిస్తుంది.

*ఆరోగ్యకరమైన కొవ్వులు*

మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును హార్మోన్లు ఇంప్రూవ్ చేస్తాయి. మనోపాజ్ దశ ప్రారంభమయ్యే పెరిమెనోపాజ్ దశలో ఉన్నప్పుడు, శరీరాన్ని బలంగా మార్చే న్యూట్రియెంట్ ఫుడ్స్ తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్ ఉత్పత్తికి, కణాల వాపును తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి పెంచడానికి కీలకమైనవి. అందుకే ఇవి పుష్కలంగా లభించే సాల్మన్, అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్ వంటివి తినాలి.

*ప్రోటీన్ ఫుడ్స్*

మన శరీరం బలంగా ఉండాలంటే తగినంత ప్రోటీన్ అవసరం. కండరాల నిర్మాణానికి బలోపేతానికి ఇది తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ శారీరక పటుత్వం తగ్గిపోతుంది. అంటే కండరాల బలం తగ్గుతుంది. అందుకే శారీరక శక్తిని, కండరాల బలాన్ని పెంచే ప్రోటీన్‌ ఫుడ్స్ తినాలి. 40 ఏళ్లు నిండిన తర్వాత ఆహారంలో ప్రోటీన్ లేకపోతే, మజిల్ మాస్ దెబ్బతింటుంది. ఈ వ‌య‌స్సు గ్రూప్ మహిళలు గుడ్లు, మాంసం, చేపలు, సోయా మిల్క్ వంటి ఆహారాలు తినాలి.

*మెగ్నీషియం*

40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలకు హార్మోన్ల సమతుల్యత కామన్ ప్రాబ్లమ్. ఇది ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. మెగ్నీషియం ఎనర్జీ లెవల్స్ ప్రోత్సహించి, కండరాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థ పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో హార్మోన్ల మార్పుల ప్రభావం తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

*యాంటీఆక్సిడెంట్లు*

వయసుతో పాటు మహిళల చర్మం వదులుగా, ముడతలుగా మారుతుంది. వృద్ధాప్య సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే ఆక్సిడేషన్‌ స్ట్రెస్‌, ఎన్విరాన్‌మెంటల్ డ్యామేజ్‌ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవాలి. ఇందుకు విటమిన్లు A, C, E, అలాగే సెలీనియం, జింక్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్‌లో యాడ్ చేసుకోవాలి. ఈ పోషకాలు ఏజింగ్‌ను ఇంప్రూవ్ చేసి, ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్ చేస్తాయి.

*B విటమిన్లు*

ఎనర్జీ జనరేషన్‌, మెదడు ఆరోగ్యానికి B6, B12 విటమిన్లు, ఫోలేట్ వంటివి చాలా అవసరం. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఎదురయ్యే హెల్త్ రిస్క్‌లను ఇవి న్యూట్రల్ చేస్తాయి. ఈ విటమిన్లు ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. అందుకే 40ల్లో ఉన్నవారు ఈ మైక్రో న్యూట్రియెంట్స్ లభించే ఫుడ్స్ తినాలి. అలాగే శరీరాన్ని తేమగా ఉంచేందుకు తగినంత వాటర్ తాగాలి.