Saturday, December 7, 2024
Homeప్రత్యేక కథనాలుహోటళ్లు, ఓయో రూమ్‌లలో మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్

హోటళ్లు, ఓయో రూమ్‌లలో మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్

Date:

కొత్త ప్రదేశానికి వెళ్లే వారు, పర్యాటక టూర్లకు వెళ్లి హోటళ్లలో బస చేసేవారు, వారి గుర్తింపు కార్డు ఆధార్ ఇస్తారు. వెరిఫికేషన్‌ కోసం హోటళ్లు ఆధార్‌ కార్డును అందజేయాలని కస్టమర్లను కోరుతుంటాయి. అయితే ఇలా ఆధార్‌ కార్డు ఇవ్వడం వల్ల మన విలువైన సమాచారం రిస్కులో పడుతుందని చాలా మంది భయపడుతుంటారు. అందుకే హోటల్ లేదా ఓయో రూమ్‌కి వెళ్లినప్పుడు మన సమాచారం దుర్వినియోగం కాకూడదంటే అసలైన ఆధార్ కార్డుకు బదులుగా మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును అన్ని హోటళ్లు లేదా ఓయో రూమ్‌లో అనుమతిస్తారు. మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్కు , ఆధార్ కార్డుకు మధ్య తేడా ఏంటి? ఈ కార్డు ఇవ్వడం ద్వారా సమాచారం సురక్షితంగా ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

*మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ అంటే ఏంటి?*

ఆధార్ కార్డ్ లాగానే మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ కూడా చాలా ముఖ్యమైంది. ఐడెంటిటీ ప్రూఫ్‌ కోసం ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌లో ఆధార్ నంబర్‌లోని మొదటి 8 నంబర్లు హైడ్‌ అయి ఉంటాయి. కేవలం చివరి 4 నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. తద్వారా మీ వివరాలను హోటల్‌ సిబ్బంది చూసే అవకాశం ఉండదు. అంతేకాదు మీ ఆధార్ కార్డ్‌తో జరిగే మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.

*మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?*

యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ కింది ప్రాసెస్‌ ఫాలో అవ్వాలి.

– ముందుగా ఆధార్ అధికారిక పోర్టల్‌ www.uidai ని సందర్శించండి.

– తర్వాత ఆధార్ విభాగానికి వెళ్లి ‘మై ఆధార్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

 *ఇప్పుడు మీ ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి.*

– అనంతరం OTP ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోండి.

– ఆధార్‌తో రిజిస్టర్‌ అయిన మీ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయండి.

– ఇప్పుడు డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

– దీని తర్వాత చెక్‌ బాక్స్‌లో కనిపించే డౌన్‌లోడ్‌ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఆప్షన్‌పై టిక్‌ చేయండి.

– చెక్‌ బాక్స్‌ను టిక్‌ చేసి సబ్మిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

– వెంటనే మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది.

మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ కలిగి ఉంటుంది. పాస్‌వర్డ్‌కోసం మీ పేరులోని నాలుగు అక్షరాలు, మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని ఎంటర్‌ చేయండి. వెంటనే మీ మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.

*మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌ని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?*

ఆధార్ కార్డు హోల్డర్లు హోటళ్లలో లేదా ఓయో రూమ్‌లలో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డుని ఉపయోగించవచ్చు. విమానాశ్రయంలో కూడా అనుమతిస్తారు.