హైదరాబాద్ నగర పరిధిలో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాలో మెంబర్స్ గా మంత్రులు ఉన్నారు..అయినా సరే వారివి అక్రమనిర్మాణాలు అని తేలితే కూల్చేస్తామని హెచ్చరించారు. ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కాలేజీ ల పై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు.
చెరువుల్లో నిర్మాణాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను గుర్తించాం.. వారిని త్వరలోనే జైలుకు పంపుతామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించబోతున్నామన్నారు. హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వరు.. అక్రమంగా కట్టుకున్నారు అని విచారణలో తేలితే వెంటనే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.