కరెన్సీ నోట్లను లంచంగా రోడ్డుపై విసిరివేయడంతో ఆ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరి వెళ్లిపోయాడు. ఏఎస్ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్లు తీసుకున్నారు.
కొందరు వ్యక్తులు దీనిని మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఏఎస్ఐతో సహా నలుగురు పోలీసులను వెంటనే సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీయూష్ పాండే తెలిపారు. ఇలాంటి సంఘటనలను సహించబోమని ఆయన అన్నారు.