Tuesday, October 1, 2024
HomeUncategorizedషాప్ ముందు దిష్టిబొమ్మలా మహిళ ఫోటో

షాప్ ముందు దిష్టిబొమ్మలా మహిళ ఫోటో

Date:

కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఇతరుల కళ్లు పడకుండా ‘దిష్టి బొమ్మ’ను వేలాడదీస్తారు. అచ్చం అలానే ఓ వ్యాపారస్తుడు తన షాప్ ముందు ఓ మహిళ ఫోటో వేలాడ దీశాడు. తన వ్యాపారంపై నరుల దిష్టి పడకుండా ఈ ప్రయత్నం చేశారు. కాని వేలాడదీసిన ఆ ఫోటో ఎవరనేదే ఇక్కడ సస్పెన్స్ గా మారింది.

బెంగుళూరులోని ఓ కూరగాయల దుకాణంలో వేలాడుతున్న మహిళ ఫోటోను ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటో చూశాక తాను నవ్వుకున్నానని అర్థం వచ్చేలా.. నేను ఈ రోజు బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని నెటిజెన్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఫోటోల గల స్త్రీ విశాలమైన కళ్లతో కోపంగా చూస్తున్నట్లు ఉంది.