ముందడుగు పౌండేషన్, సేవ్ ద గర్ల్ చైల్డ్ సంయుక్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాల సంధర్బంగా మీ బతుకమ్మతో సెల్పీ కాంటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ బతుకమ్మ పండుగ అంటేనే బాలికలు, యువతులు, మహిళలు ఎంతో అందంగా ముస్తాబై బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తారు.
అలాంటిది ముందడుగు పౌండేషన్, సేవ్ ద గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో మీరు అందంగా ముస్తాబై మీరు అందంగా తీర్చిదిద్దిన, మీ బతుకమ్మతో సెల్పీ పంపండి. మీ బతుకమ్మతో మీరు పంపిన మీ సెల్పీలో మొదటి ఐదుగురిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు డా. గాధిరాజు స్రవంతి, డా. ఇందిరా ప్రియ దర్శిని, గీతానంద్, హేమ అన్నారు. అందమైన బతుకమ్మలతో విజేతలుగా నిలిచిన ఐదుగురు మహిళామణులకు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని తెలిపారు. మీరు మీ బతుకమ్మతో తీసుకున్న సెల్పీ ఫోటో 9491114616 నంబర్‌కు వాట్సప్ చేయాలని వారు కోరారు.