Thursday, September 26, 2024
HomeUncategorizedమోడీపై డీఎంకే మంత్రి అనుచిత వ్యాఖ్యలు

మోడీపై డీఎంకే మంత్రి అనుచిత వ్యాఖ్యలు

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార-ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో అధికార డీఎంకే మంత్రి రాధాకృష్ణన్, ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే చెలరేగాయి. ప్రధానిపై ఆయన నోరు పారేసుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి రాధాకృష్ణన్‌పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్‌ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్‌ రాజు మిమ్మల్ని కమల్‌ రాజు హత్తుకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంత్రి అనితా రాధాకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారని మండిపడ్డారు. మోడీపై క్షమించరాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేత కనిమొళి సమక్షంలోనే మోడీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారని తెలిపారు. తాము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతామని అన్నామలై ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.