Tuesday, October 1, 2024
HomeUncategorizedమూడు గ్రామాల్లో ఓటు వెయ్యని గ్రామస్థులు

మూడు గ్రామాల్లో ఓటు వెయ్యని గ్రామస్థులు

Date:

లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా గుజరాత్‌లోని మూడు గ్రామాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మంది ఓటు వేశారు. గుజరాత్‌లోని బీజీపీ ప్రభుత్వం ఆయా గ్రామాలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ గ్రామాల ప్రజలంతా పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటింగ్‌ను సంపూర్ణంగా బహిష్కరించిన గ్రామాల్లో బరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామం, సూరత్‌ జిల్లాలోని సనధారా గ్రామం, బనస్కాంత జిల్లాలోని భఖారీ గ్రామం ఉన్నాయి.

అదేవిధంగా జునాగఢ్‌ జిల్లాలోని భత్గమ్‌ గ్రామంలో , మహిసాగర్‌ జిల్లాలోని బదోలీ, కుంజర గ్రామంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ గ్రామాల మధ్య నదిపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోనందుకు కొన్ని గ్రామాల వాళ్లు, తమ గ్రామాన్ని విభజించినందుకు నిరసనగా కొన్ని గ్రామాలవాళ్లు ఇలా ఓటింగ్‌ను బహిష్కరించారు.