Thursday, October 10, 2024
Homeజాతీయందేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి

దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి

Date:

తిరుమ‌ల ల‌డ్డు నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కల్తీ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడినట్లు ఆధారాలు లేవు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండి అని సుప్రీంకోర్టు కోరింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ని ల్యాబ్‌కి పంపించారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే.. లడ్డూలను ముందుగానే పరీక్షకు ఎందుకు పంపలేదు? అని సుప్రీంకోర్టు నిలదీసింది. నెయ్యి కల్తీ అయ్యింది అని వచ్చిన రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. మైసూర్, గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్ తీసుకోవాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చివరకు సుప్రీంకోర్టు ఓ సంచలన వ్యాఖ్య కూడా చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి అని అత్యున్నత న్యాయస్థానం అందంటే.. పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారా లేదా అనేది టీటీడీ చెప్పాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశం అని తెలిపిన కోర్టు.. కల్తీనెయ్యిని వాడలేదని టీటీడీ చెబుతోందని తెలిపింది. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారం లేదు అని సుప్రీంకోర్టు తేల్చింది. గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో లడ్డూ తయారుచేసిందని సీఎం ప్రజల్లోకి వెళ్లి అన్నారన్న సుప్రీంకోర్టు.. సీఎం వ్యాఖ్యలు, టీటీడీ వాదనపై స్పష్టత కావాలని కోరింది. లడ్డూ తయారీలో నాణ్యత లేదు అని భక్తులు కంప్లైంట్ ఇచ్చినట్లు టీటీడీ తరపు లాయర్ లూథ్రా తెలపగా.. మొత్తంగా ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో.. లడ్డూ తయారుచేసినట్లు ఆధారాలు లేవు అని సుప్రీంకోర్టు తెలిపింది. రెండువైపులా వాదనలను రికార్డ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను గురువారం (అక్టోబర్ 3)కి వాయిదా వేసింది.