Tuesday, October 1, 2024
HomeUncategorizedమినీ-ఆఫ్రికా గ్రామంలో ఓటు వేసిన సిద్దీ తెగ

మినీ-ఆఫ్రికా గ్రామంలో ఓటు వేసిన సిద్దీ తెగ

Date:

దేశంలో అత్యంత అరుదుగా ఉన్న మినీ-ఆఫ్రికా గ్రామంలో కూడా పోలింగ్‌ హడావుడి కనిపిస్తోంది. జునాఘడ్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే జంబుర్‌లో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానామ్ గుజరాత్ రాష్ట్రంలో జీవిస్తోంది.

2022లో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటుహక్కును కల్పించింది. మొత్తం 1,500 మందికి ఓటు హక్కు ఉంది. ప్రత్యేకంగా వీరి కోసం ఓ పోలింగ్‌ బూత్‌ కూడా ఏర్పాటుచేశారు. నేడు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ వీరు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మినీ-ఆఫ్రికన్‌ గ్రామాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీరి జనాభా 0.25 మిలియన్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.