Tuesday, September 24, 2024
HomeUncategorizedబిఆర్ఎస్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు

బిఆర్ఎస్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు

Date:

బిఆర్ఎస్ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. నగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిలో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అల్వాల్‌ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం. రెండో దశలో 75కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం. నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్‌లో బిఆర్ఎస్ ధర్నా చేపట్టాలి. దానికి కాంగ్రెస్‌ పూర్తిగా సహకరిస్తుంది. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు” అని రేవంత్‌రెడ్డి అన్నారు.