Wednesday, October 2, 2024
HomeUncategorizedనాకు భర్త వద్దు ఆడపడుచు కావాలి

నాకు భర్త వద్దు ఆడపడుచు కావాలి

Date:

ప్రస్తుత సమాజంలో బంధాలకు అర్ధాలు మారిపోతున్నాయి. అమ్మాయికి అమ్మాయితో, అబ్బాయికి అబ్బాయితో ఎఫైర్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వివాహిత తన సొంత ఆడబడుచుతో ప్రేమలో పడింది. ఆమె కూడా తన వదినను ఇష్టపడటం మొదలుపెట్టింది. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే విడిపోవడానికి ఇద్దరూ అంగీకరించలేదు. తాము కలిసి జీవిస్తామని.. కలిసి మరనిస్తామని మమ్మల్ని ఎవరూ విడదీయలేరని చెప్పారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. బాలికలిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరువురు కుటుంబసభ్యులతోనూ చర్చించనున్నారు. ఈ సంఘటన ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ పట్టణంలో చోటు చేసుకుంది.