Thursday, October 10, 2024
Homeఆంధ్రప్రదేశ్ఇక్క‌డ మాలధారణ చేస్తే మ‌ద్యం మానేస్తారు

ఇక్క‌డ మాలధారణ చేస్తే మ‌ద్యం మానేస్తారు

Date:

మ‌ద్యం ఆరోగ్యానికి హానిక‌రమ‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే.. కాని చాలామంది మ‌ద్యానికి బానిసై ఆరోగ్యంతో పాటు కుటుంబాన్ని నాశ‌నం చేస్తుంటారు. ఇంట్లో వ్య‌క్తి మ‌ద్యం మానేయ‌డానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మానిపించ‌గ‌ల దేవాల‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంది.. ఇక్క‌డి స్వామి వారిని ద‌ర్శించుకుంటే మనిషిలోని చెడు గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లి పూలమాలలు వేస్తే మద్యానికి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామిని ఆంధ్ర పుండరీపురంగా ​​పిలుస్తారు. ఆలయ గొప్పతనం గురించి తెలియని మందు బాబులు ఇక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. తాగుబోతులను పోగొట్టే దైవంగా ఉంతకల్లులో వెలసిన పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి ఆలయం మందు బాబులతో కిటకిటలాడుతుంది.

ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిస్తే. మెడలో పాండురంగ స్వామి దండ ఉంటే తాగి చాలా దూరం పరిగెత్తేవాడట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాండురంగ స్వామి మాల మాసంలోని శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లో మాత్రమే ధరించాలి. తాగుబోతులు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం చాలా ఏళ్లుగా ఆచారం. స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందు తాగడం మానేయాలనే దృఢ సంకల్పంతో మాలధారణ చేయాలనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తుల మెడలో పాండురంగ స్వామి మాల వేస్తారు. పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారికి మళ్లీ మద్యం ముట్టిన దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మద్యానికి బానిసలైన వారు స్వామివారి ఆలయానికి వచ్చి మాలధారణ చేసిన తర్వాత మద్యానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతారన్నారు.