Thursday, September 26, 2024
HomeUncategorizedతెలంగాణలో వాడవాడలా హోలీ వేడుకలు

తెలంగాణలో వాడవాడలా హోలీ వేడుకలు

Date:

తెలంగాణలో హోలీ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. వాడవాడలా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రంగులతో హోరెత్తించారు. ఒకరిపై మరొకరు ఉత్సహంగా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వివిధ జిల్లాల అధికారులు సైతం హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం రంగులు పూసుకుంటూ వేడుకలు చేసుకున్నారు. పల్లె నుంచి పట్నం వరకు పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపించింది.