Monday, September 23, 2024
HomeUncategorizedతెలంగాణలో గృహజ్యోతి పథకం అమలు..

తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలు..

Date:

తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 27వ తేదీన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకంకు శ్రీకారం చుట్టగా ఈ పథకం ప్రయోజనాలు శుక్రవారం నుంచి రాష్ట్రంలో అమలులోకి వచ్చాయి. గృహజ్యోతి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన విద్యుత్ వినియోగదారులకు తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు జీరో బిల్లులు జారీ చేస్తున్నాయి. మీటర్ రీడింగులు తీస్తున్న సిబ్బంది.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన అర్హులకు గృహజ్యోతి జీరో బిల్లులను అందజేస్తున్నారు. జీరో బిల్లులు అందుకున్న వినియోగదారులు ఎలాంటి బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు.

‘జీరో బిల్లులు’ జారీ చేసేందుకు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుందని చెప్పారు. అయితే గృహజ్యోతి స్కీమ్ కింద విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీ వ్యయాన్ని కవర్ చేయడానికి.. డిస్కమ్‌లు ప్రతి నెల సబ్సిడీ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ప్రభుత్వం ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు రీయింబర్స్ చేయనుంది.