Thursday, September 26, 2024
HomeUncategorizedగోవాలో తొలిసారిగా మహిళ ఎంపీగా పోటీ

గోవాలో తొలిసారిగా మహిళ ఎంపీగా పోటీ

Date:

బిజెపి తొలిసారిగా గోవాలో ఒక మహిళను పోటీకి దింపుతున్నారు. బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త ఘనత సాధించారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో ఆదివారం నాడు విడుదలైన జాబితాలో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పల్లవి డెంపోను దక్షిణ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది.

గోవా రాష్ట్రంలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మహిళగా పల్లవి డెంపో చరిత్రకెక్కారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే కమలం పార్టీ గెలిచింది. ఇక, పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుండగా.. ఆమె ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం వ్యవరిస్తున్నారు.