Monday, September 30, 2024
HomeUncategorizedకుమార్తె పెళ్లి కోసం డిపాజిట్ ఇవ్వని బ్యాంక్

కుమార్తె పెళ్లి కోసం డిపాజిట్ ఇవ్వని బ్యాంక్

Date:

కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న డిపాజిట్ డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ ఎన్ని సార్లు బ్యాంకు సిబ్బంది డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. మారుత్తూరుకు చెందిన 52 ఏళ్ల సోమసాగరం, పెరుంపఝూత్తూర్ సహకార బ్యాంకులో ఐదు లక్షలు డిపాజిట్‌ చేశాడు. అయితే కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం డిపాజిట్‌ డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరాడు. ఆరు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఆత్మహత్య చేసుకుంటానని సోమసాగరం బెదిరించినప్పటికీ బ్యాంకు సిబ్బంది స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఏప్రిల్‌ 19న విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ నేపథ్యంలో 86 ఏళ్ల సోమసాగరం తండ్రి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.