Tuesday, October 1, 2024
HomeUncategorizedఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు

ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు

Date:

దేశంలో జరుగుతున్న సార్వత్రిక సమరం వేళ.. ఓటర్లను భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక యంత్రాంగాలు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. దానిలో భాగంగా కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీలో ఒక కేంద్రం వద్ద ఓటర్ల కోసం రాచరికం ఉట్టిపడే ఏర్పాట్లు చేశారు.

ప్రజలే ప్రభువులు అనే ప్రజాస్వామ్య ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తూ.. ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు అందుబాటులో ఉంచారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. దీనిపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. తమ ఓటు హక్కును వినియోగించిన తర్వాత కిరీటాలు ధరించి, సింహాసనంపై ఆసీనులై ఫొటోలకు పోజులిస్తోన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదివరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌ కుమార్ మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం రెండు సంవత్సరాల నుంచి సన్నద్ధమవుతున్నామని చెప్పారు. అలాగే ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ జరగగా మిగిలిన చోట్ల ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి.