Monday, September 23, 2024
HomeUncategorizedఈ వ్యాయామాలతో గుండెను భద్రంగా కాపాడుకోండి

ఈ వ్యాయామాలతో గుండెను భద్రంగా కాపాడుకోండి

Date:

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నిత్యం ఎంతో మంది గుండె పోటుకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో రోజురోజుకు గుండె పోటు కారణంగా మరణిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండె సమస్యల కారణంగా ప్రాణాలు వదులుతుతున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతోన్న హృద్రోగ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అస్సలు గుండెను భద్రంగా కాపాడుకోవడానికి ఏం చేయాలి. రోజూ ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి అనే అంశాలపై ఒకసారి తెలుసుకుందాం..

మనిషి జీవనశైలిలో మారుతున్న అలవాట్లు, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇక శీతాకాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారతీయుల్లో ఎక్కువగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో వ్యాయామం చేయకపోవడం ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతీయులు వ్యాయామానికి సమయం కేటాయించని కారణంగానే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

రోజు సూర్య నమస్కారాలు

గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీరోజూ కచ్చితంగా వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా గుండె సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. నిపుణులు సూచిస్తున్న ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాయామాల్లో మొదటిది సూర్య నమస్కార్‌. సూర్య నమస్కార్‌ 12 రకాల వ్యాయామాలతో కూడిన యోగా ఆసనం. ఉదయాన్నే ఎండలో ఈ యోగాసనం చేయడం ద్వారా
గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి.

సైకిలింగ్ మంచి వ్యాయాయం

ప్రతీ రోజూ కచ్చితంగా 30 నుంచి 40 నిమిషాలపాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేగంగా నడిచినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె కండరాలను బలపరుస్తుంది అలాగే రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే సైకిలింగ్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో కనీసం 4-5 రోజులు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే, అది మన గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.