Monday, September 23, 2024
HomeUncategorizedఇందిరమ్మ ఇళ్ల పథకం మార్చి 11న ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్చి 11న ప్రారంభం

Date:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సూచించారు. దశల వారీగా నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.