Monday, September 23, 2024
HomeUncategorizedఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం

ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం

Date:

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు.

కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి.. రూ.1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రంలోని భాజపా రూ.1,200కి పెంచింది. పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నాం. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతుంది” అని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.