Tuesday, September 24, 2024
HomeUncategorizedఅత్యంత ఎత్తైన శ్మశానవాటికగా ఎవరెస్ట్

అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా ఎవరెస్ట్

Date:

ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఎంతోమంది సాహసికులు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలని కలలుగంటారు. నేపాల్‌లో ఉన్న ఈ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. భారతీయులతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా కూడా చెబుతారు. ప్రతి సంవత్సరం సుమారు 800 మంది అధిరోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. అయితే ఎక్కే వాళ్లందరిలో అందరూ సజీవంగా తిరిగి రారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జిన్ షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి చరిత్ర సృష్టించారు. మరెందరో పర్వతారోహణ చేయాలనీ అనుకున్న వారికీ ప్రేరణగా నిలిచారు.

అందరికి నేపాల్ నుంచే అనుమతి

ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లే మార్గం నేపాల్ గుండా వెళుతుంది. విశేషమేమిటంటే ఎవరెస్ట్ పర్వతం నేపాల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుంది. స్థానికులకు కూడా ఈ ఎవరెస్ట్ పర్వతం వలన ఉపాధి పొందుతున్నారు. నేపాల్ ప్రభుత్వం భారతీయ పౌరులకు 1500 నేపాలీ రూపాయలకే ప్రవేశించడానికి అనుమతిని ఇస్తుంది. అయితే దానిని ఎక్కడానికి లక్షల రూపాయలు ఖర్చవుతుంది.

మరణాలు సంభవించడానికి కారణాలు

ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్మశానవాటిక అని అంటారు. ఎందుకంటే అక్కడ మరణించిన వారి మృతదేహాలను తిరిగి తీసుకురాలేరు. ఈ మృతదేహాలను మంచులో పాతిపెట్టేస్తారు. లేదా మంచుతో కప్పుకుని పోతాయి. దీని ముఖ్య కారణం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునేవారి శారీరక మానసిక ధృడత్వాన్ని సరిగ్గా పరిశీలించకుండా అనుమతి ఇవ్వడం.. అది కూడా తక్కువ ధరకే అనుమతినివ్వడం. సరైన ఫిట్‌నెస్ పరీక్షలు లేకపోవడం.. ఎటువంటి అనుభవం లేకుండానే ఎక్స్‌డిషన్ కంపెనీలకు డబ్బు చెల్లించి ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్తూ ఉంటారు. ఈ వ్యక్తుల కారణంగా.. ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలో ఎక్కువ రద్దీ నెలకొని.. ఒకొక్కసారి జామ్ కూడా అవుతుంది.

ఎత్తైన ప్రదేశాలను తట్టుకోని మానవ శరీరం

మానవ శరీర నిర్మాణం అధిక ఎత్తును తట్టుకోలేదు. మనుషులు 8 వేల అడుగుల ఎత్తుకు వెళ్లగానే తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా ఎత్తుకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. దీంతో ఎత్తులో ఆక్సిజన్ సిలిండర్‌ తప్పనిసరి. అంతేకాదు సిలెండర్ లో ఉన్న ఆక్సిజన్‌లోని ప్రతి నిమిషం విలువైనదిగా మారుతుంది. అంతేకాదు సెరిబ్రల్ ఎడెమా మెదడులో వాపుకు కారణమవుతుంది. దీంతో మౌంట్ ఎవరెస్ట్‌ ఎక్కడానికి వెళ్లి.. ఎంతమంది మరణిస్తారో.. అక్కడే ఎన్ని మృతదేహాలను ఖననం చేస్తారో లెక్క తెలియడం కష్టమే.. కనుకనే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన శ్మశానవాటిక అంటూ అభివర్ణిస్తారు.