Friday, October 4, 2024
HomeUncategorizedతెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలే

తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలే

Date:

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గాలులతో వర్షం కురుస్తుందని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 18 నుంచి 24న ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మంతో పాటు పలు జిల్లాలతో పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.