తమ పాఠశాలకు అనుకొని వైన్ షాపును ఐదేళ్ల చిన్నారి మూసి చేయించింది. వైన్ షాపు వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు న్యాయం జరిగింది. కాన్పూర్లోని ఒక పాఠశాలకు అనుకుని ఒక వైన్ షాపు ఉంది. ఈ క్రమంలోనే స్కూల్ వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
దీంతో ఎల్ కేజీ చదువుతున్న ఓ ఐదేళ్ల చిన్నారి అలాహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. వైన్ షాపు మూసివేయాలని కోరింది. కోర్టు కూడా చిన్నారి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని వైన్స్ లైసెన్స్ ను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. స్కూల్ కు 30 మీటర్ల కంటే తక్కువ దూరంలో మద్యం షాపులు ఉండోద్దని వెల్లడించింది.
ప్రస్తుత పిటిషన్ ఫిబ్రవరిలో దాఖలైంది. వైన్ షాప్ రూల్స్, 1968 లోని రూల్ 5(4)(a) నిబంధనలపై మద్యం దుకాణం మరియు ప్రజల ప్రార్థనా స్థలం, పాఠశాల, ఆసుపత్రి లేదా నివాస కాలనీల మధ్య 50 మీటర్ల దూరం ఉండాలని ఉంది. దీంతో చిన్నారి తండ్రి ఓ లాయర్ ను పెట్టుకుని కోర్టుకెళ్లాడు. కోర్టు వైన్ షాపు లైసెన్స్ పునరుద్దరించవద్దని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఓ ఐదేళ్ల చిన్నారి వైన్ షాపు లైసెన్స్ ను రద్దు చేయించిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, నెటిజన్స్ స్పందిస్తూ ప్రతి ఒక్కరు బాలికను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.