Tuesday, October 1, 2024
HomeUncategorizedతాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించను

తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించను

Date:

దేశంలో ఉన్న ఇస్లాంను, ముస్లింలను తాను ఎప్పుడు వ్యతిరేకించనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవిధంగా స్పందించారు. ”అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు (విపక్షాలను ఉద్దేశించి) ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. దానినుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి.. తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. ట్రిపుల్ తలాక్‌ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని వారు అర్థం చేసుకున్నారు. విపక్షాలు అబద్ధాలు బయటపడ్డాయి. అదే వారి బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెప్తూనే ఉంటారు” అని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.