Tuesday, October 1, 2024
HomeUncategorizedరహదారిపై గుంతలు దానంతట అదే పూడుకుపోయే టెక్నిక్‌..

రహదారిపై గుంతలు దానంతట అదే పూడుకుపోయే టెక్నిక్‌..

Date:

దేశంలోని చాలా ప్రాంతాల్లోని రహదారుల్లో గుంతల సమస్య నిత్యం వాహనదారులను వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు పాడవడం, ట్రాఫిక్‌ జామ్‌ వంటి ఇక్కట్లే కాదు.. కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలూ ఉంటున్నాయి. దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కునేందుకు సిద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతతో పని చేస్తోంది.

సాధారణంగా రహదారులపై ఏదైనా గుంత ఏర్పడితే మళ్లీ దాన్ని మాన్యువల్‌గా పూడ్చాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ఈ గుంతల్లో నీరు నిలిచిపోయి రోడ్లు మరింత పాడవుతున్నాయి. అలా కాకుండా చిన్నపాటి గుంత లేదా పగుళ్లు ఏర్పడగానే దానంతట అదే పూడుకుపోయేందుకు గానూ రహదారుల నిర్మాణంలో సెల్ఫ్‌ హీలింగ్‌ మెటీరియల్‌ను వాడనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి. స్టీల్‌ ఫైబర్స్‌, తారు కలిపిన పదార్థాన్ని ఇందులో వాడతారు. గుంత ఏర్పడగానే తారు హీట్‌ అయ్యి దానంతట అదే పూడుకుపోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని జాతీయ రహదారులపై దీన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరీక్షిస్తోంది. ఈ మెటీరియల్‌ను వినియోగించడం వల్ల ఎంతమేర ప్రయోజనం కలగనుంది..? దానికయ్యే ఖర్చు ఎంత? వంటివీ అంచనా వేయనుంది.