Tuesday, October 1, 2024
Homeక్రైంయువకుడిపై ఫేక్ రేప్ కేసు పెట్టిన మహిళ

యువకుడిపై ఫేక్ రేప్ కేసు పెట్టిన మహిళ

Date:

ఒక యువకుడిపై ఒక మహిళ ఫేక్ రేప్ కేసు పెట్టింది. ఫేక్ రేప్ కేసు కారణంగా ఆ యువకుడు నాలుగేళ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. చివరకు అసలు నిజం బయటపడడం వల్ల 54 నెలల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే ఫేక్ రేప్ కేసు పెట్టిన మహిళకు కోర్టు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు విధించింది. ఉత్తర​ప్రదేశ్​ రాష్ట్రంలోని బరేలీకి చెందిన ఓ మహిళ డిసెంబర్​ 2,2019న తన కూతురిపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్​ అలియాస్​ రాఘవ్​ అనే యువకుడు తన 15 ఏళ్ల కూతురిని నమ్మించి ఢిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ ని కోర్టులో హాజరుపరిచారు. అజయ్​ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక కూడా మొదట వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్​లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైలులో ఉన్నాడు.

ఆ తర్వాత కోర్టులో విచారణలో తన వాంగ్మూలం​ తప్పని న్యాయమూర్తి ఎదుట ఆ బాలిక చెప్పింది. అజయ్​ తనకు ఎలాంటి హాని చేయలేదని, అతడు తనని ఢిల్లీకి కూడా తీసుకెళ్లలేదని తెలిపింది. దీంతో అజయ్​ను నిర్దోషిగా ప్రకటించింది అడిషినల్​ సెషన్స్​ కోర్టు. తప్పుడు కేసు పెట్టినందుకు ఆ బాలిక తల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఆ అమాయకపు యువకుడు శిక్ష అనుభవించినన్ని రోజులు మహిళను కూడా జైలులో ఉంచాలని జడ్జి ఆదేశించారు. దీంతో పాటు రూ.5,88,822 జరిమానా విధించారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పుతో మహిళకు కళ్లు బైర్లుగమ్మాయి.