ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు కూడా పాల్గొన్నాయి. ఎస్పీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన మెయిన్‌పురిలో బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్‌కు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో నిర్వహించారు. సుమారు పద్నాలుగు బుల్డోజర్లు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నాయి.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట ములాయం సింగ్ యాదవ్ మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు 3 లక్షల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై ఆమె గెలిచారు. మరోవైపు1996 నుంచి మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీ ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఈ స్థానం ఎస్పీకి కంచుకోటగా నిలిచింది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండింటిని బీజేపీ గెలుచుకుంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి స్థానంపై బీజేపీ దృష్టిసారించింది.