Monday, September 30, 2024
HomeUncategorizedస్మృతి ఇరానీ ఆస్తులు రూ.6 కోట్లు పెరిగాయి

స్మృతి ఇరానీ ఆస్తులు రూ.6 కోట్లు పెరిగాయి

Date:

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌ దాఖలుతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ ఆస్తులు పెరగడం విశేషం. స్మృతి ఇరానీ స్థిరాస్తుల విలువ రూ.17 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి గత ఐదేళ్లలో కేంద్రమంత్రి ఆస్తులు రూ.6 కోట్లు పెరిగాయి. ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో స్మృతి ఇరానీ వెల్లడించారు. 

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్మృతి ఇరానీ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 11 కోట్లు కాగా.. ఇప్పుడు రూ. 17 కోట్లుగా పేర్కొన్నారు. అంటే గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ కుటుంబ సంపద సుమారు రూ. 6 కోట్లు పెరిగింది. స్మృతి ఇరానీకి చెందిన చరాస్తులు రూ. 25,48,000 ఐదు పొదుపు ఖాతాలలో డిపాజిట్ చేయబడింది. రూ. 88 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్/పోస్టాఫీసు బ్యాలెన్స్ విలువ రూ. 30,77,936గా ఉంది. 2023లో కారును కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఇక ఆభరణాల విలువ రూ. 37,48,440గా చూపించారు. స్థిరాస్తుల్లో ఆరు వ్యవసాయ భూములు, ఒక వ్యవసాయేతర భూమి ఉంది. అలాగే నాలుగు ఇళ్లు ఉన్నట్లుగా తెలిపారు. ముంబయిలో రెండు, గోవాలో ఒకటి, పూణేలో మరొకటి ఉన్నట్లుగా వివరించారు.