Tuesday, September 24, 2024
HomeUncategorizedఏసీ బస్సుల చార్జీలపై 10 శాతం రాయితీ

ఏసీ బస్సుల చార్జీలపై 10 శాతం రాయితీ

Date:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు గుడ్ న్యూస్ ఇచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించే సమాచారాన్ని వెల్లడించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలో రాయితీని ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఈ డిస్కౌంట్‌ అమలులో ఉంటుంది.

లహరి ఏసీ స్లీపర్ బస్సులు ప్రస్తుతం హైదరాబద్- చెన్నై, హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్- బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తోన్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్- ఆదిలాబాద్, హైదరాబాద్- అసిఫాబాద్, హైదరాబాద్- మంచిర్యాల, హైదరాబాద్- నిర్మల్, గోదావరిఖని- బెంగళూరు, కరీంనగర్- బెంగళూరు, నిజామాబాద్- తిరుపతి, నిజామాబాద్- బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఆయా బస్ సర్వీసులన్నింట్లోనూ బెర్తులపై వసూలు చేసే ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ఈ రూట్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.