Monday, September 23, 2024
HomeUncategorizedరాజీవ్ గాంధీ హంత‌కుడు గుండెపోటుతో మృతి

రాజీవ్ గాంధీ హంత‌కుడు గుండెపోటుతో మృతి

Date:

భారత మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు సుతేంద్రరాజా అలియ‌స్ శంత‌న్ చెన్నైలో మృతిచెందారు. రాజీవ్ హ‌త్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో అత‌ను ఒక‌డు. శ్రీలంక జాతీయుడైన శంత‌న్.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు. బుధవారం తెల్ల‌వారుజామున 7.50 నిమిషాల‌కు అత‌నికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లు ఆస్ప‌త్రి డీన్ డాక్ట‌ర్ వీ తేర‌నిరాజ‌న్ తెలిపారు.కాలేయం దెబ్బ‌తిన‌డంతో చికిత్స కోసం అత‌ను ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. వాస్త‌వానికి బుధవారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు అత‌నికి సీపీఆర్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. కానీ మ‌ళ్లీ 7.50కి పోటు రావ‌డంతో అత‌ను చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు.

రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో సంత‌న్‌కు మ‌ర‌ణ‌శిక్ష ప‌డింది. 1999లో సుప్రీంకోర్టు ఆ తీర్పును స‌మ‌ర్థించింది కూడా. సంత‌న్‌తో పాటు మురుగ‌న్‌, పెరారివాల‌న్ కు కూడా మ‌ర‌ణ‌శిక్ష విధించారు. అయితే ఆ ముగ్గ‌రికీ క్ష‌మాభిక్ష పెట్టారు. దాంట్లో శంత‌న్ న‌వంబ‌ర్ 2022లో రిలీజయ్యాడు. 1991లో జ‌రిగిన రాజీవ్ హ‌త్య కేసులో.. త‌మిళ టైగ‌ర్స్‌కు శంత‌న్ ఓ ఇంటెలిజెన్స్ స‌భ్యుడిగా చేసిన‌ట్లు తెలుస్తోంది.