Monday, October 7, 2024
HomeUncategorizedIAS కొట్టాలంటే అంద‌గ‌త్తెలు కానవ‌స‌రం లేదు

IAS కొట్టాలంటే అంద‌గ‌త్తెలు కానవ‌స‌రం లేదు

Date:

ఒక యువ‌తి IAS కావాలంటే అంద‌గ‌త్తె కావాల్సిన అవ‌స‌రం లేద‌ని ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తోందని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ చీఫ్‌ బాలలత అన్నారు.

సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ”దివ్యాంగులను దూరం పెట్టమని స్మిత చెబుతున్నారు. రేవంత్‌ సర్కారు తొలి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చింది. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరం. స్మితా సభర్వాల్‌.. మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం. ఆమె ఫిజికల్లీ ఫిట్‌.. మెంటల్లీ అన్‌ఫిట్‌. 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేదంటే జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతాం. ఆమెపై సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తగిన చర్యలు తీసుకోవాలి” అని, స్మిత‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల‌ని బాలలత డిమాండ్ చేశారు.