Sunday, December 22, 2024
HomeUncategorized60ఏళ్ల వ్యక్తికి నిద్ర అంటే తెలియదు

60ఏళ్ల వ్యక్తికి నిద్ర అంటే తెలియదు

Date:

మనిషికి ఒక్కరోజు నిద్ర లేకుంటే చాలు పిచ్చిపిచ్చిగా తయారవుతారు. మనసు, మనసులో ఉండదు. నిద్ర తక్కువైతే మరుసటి రోజు ముఖం వాడిపోయి.. నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకుపైబడి నిద్రపోకుండా ఉంటున్నాడు.

వియత్నాంకు చెందిన థాయ్ అంజోక్ అనే వ్యక్తి తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలిపాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని తెలిపాడు. ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేదని అంజోక్‌ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్‌ ఆరోగ్యంపై ఏమాత్రం ‍ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్‌ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. ఇతను గ్రీన్ టీ, రైస్ వైన్ ఇష్టంగా తాగుతానని, ఎంతో ఉత్సహంగా ఉంటానని చెపుతున్నాడు.