Sunday, September 22, 2024
HomeUncategorized48విద్యార్థులు.. ఒక్కడే ఉపాధ్యాయిడు

48విద్యార్థులు.. ఒక్కడే ఉపాధ్యాయిడు

Date:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడం మూలంగా తమ పిల్లల చదువులు కొనసాగడం లేదంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను బయటకు పంపి పాఠశాలకు తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి నుండి ఐదోవ తరగతి వరకు ఉన్న కురవపల్లి కొత్తూరు మండల ప్రాథమిక పాఠశాలలో 48 విద్యార్థుల చదువుకుంటున్నారు. వీరందరికీ ఒక్కరే ఉపాద్యాయుడు పాఠాలు చెపుతున్నారు. తాము ఎలాగూ చదువుకోలేదు కనీసం తమ పిల్లల నైన చదివిపించాలని అనుకున్నా అడవి బిడ్డలు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.