Wednesday, September 25, 2024
HomeUncategorized18 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

18 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

Date:

ప్రపంచవ్యాప్తంగా నేడు ఓటీటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు పుట్టగొడుగుల్లా కొత్త, కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో ఇదే అదునుగా తీసుకుని కొన్ని అడల్ట్ వెబ్ సిరీస్ లు సినిమాలు లాంటివి వీటి లోనే రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ ఓటీటీలో ఎక్కువ స్థాయిలో అశ్లీలతను ప్రచారం చేస్తుండడంతో వాటిలో మొత్తంగా ఓ 18 యాప్స్ ని తాజాగా భారత ప్రభుత్వం ఇప్పుడు నిషేధించింది. దీనికి సంబంధించి ఐ అండ్ బీ మినిస్ట్రీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అంతేకాదు వీటికి సంబంధించిన 57 సోషల్ మీడియా అకౌంట్స్ కూడా బ్యాన్ చేసింది. అనుబంధ వెబ్ సైట్స్‌ను కూడా శాశ్వతంగా తొలగించింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నైతిక విలువలు పాటించాలనీ, సమాజాన్ని పెడదారి పట్టించే అశ్లీల చిత్రాల చిత్రీకరణ, ప్రసారాలను నిలిపివేయాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారమే ఓటీటీ యాప్‌లపై ఈ నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గతంలోనే అశ్లీల వైబ్‌సైట్లను బ్యాన్ చేసిన కేంద్రం తాజాగా ఈ డిసిజన్ తీసుకోవడంతో.. ఈ పరిశ్రమపై ఆధార పడిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బ్యాన్ చేసిన ఓటీటీ యాప్ లిస్ట్ చూస్తే.. Uncut Adda, Prime Play, Nuefliks, X Prime, Dream Films, Neon X VIP, MoodX, Tri Flicks, Xtramood, Chikooflix, Hot Shots VIP, Mojflix, Besharams, Voov, Fugi, Rabbit, Yessma, Hunters వంటి ఓ 18 ఓటీటీ యాప్స్‌తో పాటు వీటికి లింకైన 19 వెబ్ సైట్స్‌ను, 57 సోషల్ మీడియా అకౌంట్స్‌ను కేంద్రం బ్లాక్‌లిస్టులో చేర్చింది.