Wednesday, October 2, 2024
HomeUncategorized16 రోజుల్లో విజయవాడ కనకదుర్గమ్మకు రూ.2.09కోట్ల నగదు

16 రోజుల్లో విజయవాడ కనకదుర్గమ్మకు రూ.2.09కోట్ల నగదు

Date:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యకేత్రాలలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేవలం 16 రోజుల్లోనే దుర్గమ్మకు రూ.2,09,49,116 కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారిని కేవలం 16 రోజుల్లోనే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, ఈ ఆలయ మహామండపంలోని ఆరో అంతస్తులో అమ్మవారి హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించారు. ఈ కార్యక్రమం ఈవో కేఎస్‌ రామారావు, అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో జరిగింది. మొత్తం రూ.2.09కోట్లకు పైగా నగదును భక్తుల కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించారు. నగదుతో పాటు 434 గ్రాముల బంగారం, 4.145 కిలోల వెండి కానుకల రూపంలో వచ్చాయి. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా ఉంది.

హుండీలలో యూఎస్ డాలర్లు 171, ఆస్ట్రేలియా డాలర్లు 115, అరబ్‌ ఎమిరేట్‌ దిర్హమ్స్‌ 105, సౌదీ రియాల్స్‌ 66, మలేషియా రింగెట్లు 50, కెనడా డాలర్లు 10, ఇంగ్లండ్‌ పౌండ్లు 5, కువైట్‌ దినార్‌ 1, బహరైన్‌ దినార్లు 3.5 ఉన్నాయి. వీటితోపాటు ఆన్‌లైన్‌ ఈ-హుండీ ద్వారా 45,01,0 కానుకలను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఇక్కడ ప్రతిరోజు భక్తుల కోసం అన్నవితరణ కార్యక్రమం ఉటుంది. అలాగే దుర్గమ్మ ఆలయంలో అన్నవితరణ కోసం గుంటూరుకు చెందిన ఆర్‌.కోటిసుధాకర్‌ కుటుంబసభ్యులు రూ.1,01,116లు విరాళం అందజేసినట్ల ఆలయ అధికారులు తెలిపారు.