Tuesday, October 1, 2024
HomeUncategorized15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న పద్మారావు

15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న పద్మారావు

Date:

తెలంగాణలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు. పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు మోండా మార్కెట్ పరిధిలో ఉంటాయి. అయితే ఈ మోండా మార్కెట్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులు సనత్ నగర్ అభ్యర్థిలకు ఓటు వేయాల్సి వచ్చేది.

అయితే పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీ పోటీ చేస్తున్నారు. మోండా మార్కెట్ సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది. దీంతో పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోండా మార్కెట్ లోని ఇస్లామయి హైస్కూల్ లో ఓటు వేశారు. పద్మారావు గౌడ్ 2009లో తన ఓటు తనకే వేసుకున్నారు. అప్పుడు మోండా మార్కెట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్ వ్యవస్థికరణలో భాగంగా సనత్ నగర్ లోకి వెళ్లింది.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్మారావు గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పద్మా రావు గౌడ్ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.