Tuesday, October 1, 2024
HomeUncategorized14వ తేదీన మోడీ నామినేషన్‌

14వ తేదీన మోడీ నామినేషన్‌

Date:

అమిత్‌ షా పర్యవేక్షణలో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో 14వ తేదీన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను కూడా ప్రధాని సందర్శించే అవకాశాలున్నాయి. బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు నిర్వహించనున్న ఐదు కిలోమీటర్ల రోడ్‌షో సుమారు నాలుగు గంటలపాటు జరగనుంది. అదే రోజు ఎన్‌డీఏ నేతల సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

గతంలో నామినేషన్‌ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. మోడీకి ప్రస్తుతం 73 ఏళ్లు. 2024 ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. సగటున మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో నాలుగు ర్యాలీల్లో పాల్గొని.. అనంతరం పట్నా వెళ్లి అక్కడ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇక సోమవారం పట్నాలోనే మూడు ర్యాలీలను పూర్తిచేసుకొని వారణాసి చేరుకుంటారు. అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మే చివరి నాటికి మోదీ మొత్తం 180-190 రోడ్‌షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొన్నట్లవుతుంది.