Friday, September 20, 2024
HomeUncategorizedహిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న మంచు

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న మంచు

Date:

ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి.

అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో జాతీయ రహదారులు సహా 475 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంబాలో 56 రోడ్లు, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు సహా పలు జాతీయ రహదారును సైతం అధికారులు మూసివేశారు. భారీ హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.