Monday, September 30, 2024
HomeUncategorized'హార్లిక్స్‌'పై 'హెల్త్‌ డ్రింక్‌' పేరు తొలగింపు

‘హార్లిక్స్‌’పై ‘హెల్త్‌ డ్రింక్‌’ పేరు తొలగింపు

Date:

చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా త్రాగే హార్లిక్స్‌ పై, ఆ కంపెనీ తన లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. ‘హార్లిక్స్‌’ను ‘హెల్త్‌ డ్రింక్‌’గా పేర్కొన్న ‘హిందుస్తాన్‌ యూనిలీవర్‌’ (హెచ్‌యూఎల్‌), దాన్ని తొలగించి..’ఫంక్షనల్‌ న్యూట్రీషినల్‌ డ్రింక్స్‌’గా మార్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల మేరకు హెచ్‌యూఎల్‌ ఈ మార్పును చేపట్టినట్టు తెలుస్తున్నది.

బోర్న్‌వీటా, హార్లిక్స్‌లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు రావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ దీనిపై స్పందిస్తూ, ఈ అంశంపై విచారణ జరపాలని ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ని ఆదేశించింది. దీంతో కంపెనీలు తమ ఆహార ఉత్పత్తుల లేబుల్‌పై మార్పులు చేసినట్టు తెలుస్తున్నది.