Sunday, December 22, 2024
HomeUncategorizedసెలబ్రిటీ యాడ్‌లను తొలగించిన యూట్యూబ్‌

సెలబ్రిటీ యాడ్‌లను తొలగించిన యూట్యూబ్‌

Date:

కొత్తగా ఏఐ సాంకేతికత రావడంతో అందులో నకిలీ ఎవరో, ఒరిజినల్ ఎవరో అర్థం కావడం లేదు. సెలబ్రిటీలు, ప్రముఖుల డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌గా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ సాంకేతికతను వినియోగించుకొని కొందరు కేటుగాళ్లు వీటిని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ యూజర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న మోసపూరిత ప్రకటనల వీడియోలను యూట్యూబ్‌ తొలగించింది.

సెలబ్రిటీలపై వస్తున్న నకిలీ వీడియోలపై 404 మీడియా పరిశోధించింది. దీని ప్రకారం.. వీటిలో ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్, నటుడు స్టీవ్‌ హార్వే మరికొందరు ప్రముఖుల వీడియోలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఉన్న ప్రకటనలకు సంబంధించి 1000కి పైగా నకిలీ యాడ్‌లను యూట్యూబ్‌ తొలగించింది. ఇప్పటివరకు ఈ డీప్‌ఫేక్‌ వీడియోలను 200 మిలియన్ల మంది వీక్షించారు. ఏఐను వినియోగించి కొందరు కంటెంట్‌ క్రియేట్ చేస్తున్న వీడియోలపై యూట్యూబ్‌ అసహనం వ్యక్తంచేసింది. ఈ కంటెంట్‌ తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటంతో వీటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.