Tuesday, October 8, 2024
HomeUncategorizedసివిల్స్ నాలుగుసార్లు ర్యాంక్ వ‌చ్చినా ఉద్యోగం ఇవ్వ‌లే

సివిల్స్ నాలుగుసార్లు ర్యాంక్ వ‌చ్చినా ఉద్యోగం ఇవ్వ‌లే

Date:

ఒక దివ్యాంగుడు సివిల్స్ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకొని అందులో అర్హ‌త సాధించాడు. నాలుగుసార్లు సివిల్స్‌లో ర్యాంకు పొందాడు కానీ అత‌డికి ఉద్యోగం మాత్రం రాలేదు. క్ డిజెబిలిటీ సర్టిఫికెట్​తో సివిల్స్ ఉద్యో గం పొందిన పూజా ఖేద్కర్ వివాదం వేళ.. అర్హుడైన కార్తీక్​ క‌న్సాల్‌కు అన్యాయం జరిగిందంటూ ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కార్తీక్ స్టోరీని రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ గుప్తా ట్విట్టర్​లో పోస్టు చేశారు.

సివిల్స్ ల‌క్ష్యాన్ని చిదిమేస్తున్నారు

కార్తీక్ కన్సాల్ ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సివిల్స్​కు ప్రిపేర్ అయ్యాడు. 2019లో 813వ ర్యాంక్ సాధించాడు. అప్పుడు మొత్తం 15 లోకోమోటర్ డిజెబిలిటీ ఖాళీలు ఉండగా 14 పోస్టులను భర్తీ చేశారు. కార్తీక్​కు ఉద్యోగం రావాల్సి ఉండగా రాలేదు. 2021లో కార్తీక్ 271వ ర్యాంక్ సాధించాడు. ఆ నోటిఫికేషన్​లో ఏడు లోకోమోటర్ డిజెబిలిటీ పోస్టులు ఉండగా, నాలుగింటిని భర్తీ చేశారు. ఆ కేటగిరీలో కార్తీక్ ఫస్ట్ ప్లేసులో ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఇక 2022లో 784, 2023లో 829వ ర్యాంకులు సాధించినా యూపీఎస్సీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై కార్తీక్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాగా, ప్రస్తుతం కార్తీక్ ఇస్రోలో సైంటిస్ట్​గా పని చేస్తున్నాడు.

60శాత‌మే డిజెబిలిటీ కానీ

కార్తీక్ మస్కులర్ డిస్ట్రోఫితో బాధపడుతున్నాడని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ధారించింది. డిజెబిలిటీ 60 శాతమేనని సర్టిఫికెట్​లో ఉంది కానీ అది 90 శాతమని పేర్కొంది. కార్తీక్ చూడడం, వినడం, రాయడం, మాట్లాడడం అన్నీ చేయగలడు.. కానీ నిలబడలేడని తెలిపింది. యూపీఎస్సీ రూల్స్ ప్రకారం.. ఐఏఎస్​కు మస్కులర్ డిస్ట్రోఫి ఉన్నోళ్లు అనర్హులు. ‘నిపుణుల సూచన మేరకు ఫంక్షనల్, ఫిజికల్ అర్హతలను బట్టి దివ్యాంగులకు సర్వీసులను కేటాయిస్తాం. కార్తీక్​ ర్యాంక్, అర్హతలను బట్టి.. ఆయన ఏ సర్వీస్​కు సరిపోలేదు’ అని యూపీఎస్సీ పేర్కొంది.