Friday, September 20, 2024
HomeUncategorizedసిగరెట్ తాగిన సీత పాత్రధారి

సిగరెట్ తాగిన సీత పాత్రధారి

Date:

ముంబైలోని ఒక యూనివర్సిటీలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. సీత పాత్ర వేసిన వ్యక్తి సిగరెట్‌ స్మోక్‌ చేయడం, రాముడు పాత్రధారి సహకరించడం వంటి దృశ్యాలు, అసభ్యకర డైలాగులు ఉన్నాయి. విద్యార్థులు, హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వారి ఫిర్యాదుతో ప్రొఫెసర్‌, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. సావిత్రీబాయి పూలే యూనివర్సిటీలోని లలిత కళా వేదికపై శుక్రవారం రామ్‌ లీలా నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. సీత వేషం వేసిన పురుష కళాకారుడు సిగరెట్‌ నోట్లో పెట్టుకోగా లైటర్‌తో వెలిగించేందుకు రాముడు పాత్రధారి సహకరించాడు. ఇలాంటి సన్నివేశాలతోపాటు అభ్యంతరకర డైలాగులు ఈ నాటకంలో ప్రదర్శించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

కాగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో మరో వర్గం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఏబీవీపీ విద్యార్థులు, హిందూ సంఘాలు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లలిత కళా కేంద్రం విభాగాధిపతి అయిన ప్రొఫెసర్‌ డాక్టర్ ప్రవీణ్ భోలే, నాటకం పాత్రధారులైన విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దాల్వీ, యశ్ చిఖ్లేను పోలీసులు అరెస్ట్‌ చేశారు.