Monday, September 23, 2024
HomeUncategorizedసింగరేణి కార్మికలకు రూ. కోటి ప్రమాద బీమా

సింగరేణి కార్మికలకు రూ. కోటి ప్రమాద బీమా

Date:

తెలంగాణలోని సింగరేణి కార్మికలకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బీమా పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు.

2014లో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణలో పరిపాలనను గాలికొదిలేసారని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. మరో రెండు గ్యారంటీలకు రంగం సిద్ధమైందని స్పష్టం చేశారు.