Monday, September 30, 2024
HomeUncategorizedసాధారణ ఉద్యోగిగా చేరి ఆ కంపెనీకే సీఈఓ అయ్యాడు

సాధారణ ఉద్యోగిగా చేరి ఆ కంపెనీకే సీఈఓ అయ్యాడు

Date:

గూగుల్‌లో ఉద్యోగిగా భారత్‌ నుంచి వెళ్లిన ఓ కుర్రాడు ఏకంగా ఆ కంపెనీకే సీఈఓ అయ్యాడు. ఇప్పుడు కంపెనీ నడిపించే స్థాయికి ఎదిగాడు. ఆయనే సుందర్‌ పిచాయ్. తన 20 ఏళ్ల గూగుల్ ప్రస్థానాన్ని వెల్లడిస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు ఆకట్టుకుంటోంది.

ఏప్రిల్ 26, 2004.. గూగుల్‌లో నాకు మొదటిరోజు. అప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య..ఇలా ఎంతో మారింది. అలాగే నా జుట్టు కూడా. ఈ 20 ఏళ్లలో మారని అంశం ఒకటి ఉంది. ఆ అద్భుతమైన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను పొందే థ్రిల్‌ ఇప్పటికీ మారలేదు. ఇందులో భాగమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడినని భావిస్తున్నాను” అంటూ ’20’ నంబర్‌ ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. 2004లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాటిది, ప్రస్తుత ఐడీ కార్డును పంచుకున్నారు. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీ జుట్టు తగ్గింది.. గూగుల్ ఆదాయం పెరిగిందని ఒకరు చమత్కరించారు. మీరు నా రోల్‌ మోడల్‌ సర్, మీ నిబద్ధత గొప్పది అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లోకి అడుగుపెట్టిన సుందర్‌ పిచాయ్‌ ఆ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్‌ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చాయి. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కిన సంగతి తెలిసిందే.