Sunday, September 22, 2024
HomeUncategorizedసమయానికి జాకెట్ కుట్టని టైలర్

సమయానికి జాకెట్ కుట్టని టైలర్

Date:

అడ్వాన్స్‌ చెల్లించినా సకాలంలో బ్లౌజ్‌ కుట్టకపోవడంతో ఓ దర్జీకి పెద్ద దెబ్బ తగిలింది. లేడీ టైలర్ రూ. 15,000 జరిమానా చెల్లించవలసి వచ్చింది. అంతేకాదు శిక్ష కింద బ్లౌజ్‌ను ఉచితంగా కుట్టి ఇవ్వాల్సి వచ్చింది. వినియోగదారుల ఫోరం విధించింది. ఈ ఘటన మహారాష్ట్ర ధారశివ్‌లో చోటుచేసుకుంది. జనవరి 2023లో ఫిర్యాదుదారు స్వాతి ప్రశాంత్ కస్తూరే నగరంలోని.. టైలర్ నేహా సంత్‌కు రెండు వర్క్ బ్లౌజ్‌లను ఇచ్చింది. ఇందుకోసం మొత్తం రూ.6 వేల 300 బిల్లు అవుతుందని చెప్పగా… రూ.3 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించింది స్వాతి. కానీ నేహా సంత్ అడ్వాన్స్ మొత్తం తీసుకున్నా చెప్పిన సమయానికి స్వాతికి బ్లౌజ్‌లు ఇవ్వలేదు. 

స్వాతి… నేహాను ఫోన్ ద్వారా పలుమార్లు సంపద్రించింది. మెసేజులు చేసింది. అయినా కూడా నో రెస్పాన్స్. ఇక లాభం లేదని భావించి.. 28 ఏప్రిల్ 2023న స్వాతి వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కన్జూమర్ ఫోరం నేహాకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసుపై స్పందించకుండా నేహా సంత్ విచారణకు గైర్హాజరయ్యారు. అందువల్ల, వినియోగదారుల ఫోరమ్ 15 జూలై 2024న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసింది. నేహా సంత్ రూ. 15,000 జరిమానాను స్వాతి కస్తూరేకు చెల్లించాలని ఆదేశించింది. శిక్షగా స్వాతి బ్లౌజ్‌ని ఉచితంగా కుట్టించాలని కూడా నేహాకు ఆదేశాలు వచ్చాయి.