Thursday, October 3, 2024
HomeUncategorizedసన్నీ లియోన్‌ ప్రదర్శనకు అనుమతి లేదు

సన్నీ లియోన్‌ ప్రదర్శనకు అనుమతి లేదు

Date:

కేరళ యూనివర్సిటీలో ప్రముఖ నటి సన్నీ లియోన్‌ తలపెట్టిన ఓ ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వకూడదని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరువనంతపురంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో జులై 5న ఈ ప్రదర్శన నిర్వహించాలని భావించారు.

గతేడాది ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సన్నీ లియోన్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటనను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అది పూర్తిగా నిర్వహణ వైఫల్యమేనని, అటువంటివి పునరావృతం కాకూడదని ఆదేశించింది. పలు భారతీయ భాషాచిత్రాల్లో నటిస్తోన్న సన్నీ లియోన్‌.. మలయాళ సినిమాల్లోనూ అడుగు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రాజెక్టు ముహుర్తానికి సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియాలో ఇటీవల వెల్లడించారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన సన్నీ.. తెలుగులోనూ నటించిన సంగతి తెలిసిందే.