Sunday, December 22, 2024
HomeUncategorizedశీతాకాలంలో మద్యం అనారోగ్యాలకు కారణం

శీతాకాలంలో మద్యం అనారోగ్యాలకు కారణం

Date:

దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాలం చలి విపరీతంగా ఉంటుంది. ఎంత వేడిని ఐనా తట్టుకుంటారు కాని చలిని మాత్రం భరించలేరు. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మద్యాన్ని తాగుతుంటారు. అలా తాగడంవల్ల ఒంట్లో వేడి పెరగడంకన్నా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు.

చలికాలంలో ఆల్కహాల్ తీసుకోవడంవల్ల ఒంట్లో ఉండే అంతర్గత ఉష్ణోగ్రత పడిపోతుంది. రక్తనాళాలు సంకోచించడం, కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడంతోపాటు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శరీరాన్ని కొంత సమయం వెచ్చిగా ఉంచినప్పటికీ తర్వాత బాడీ చల్లబడిపోవడంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఎక్కువ పానీయాలు తీసుకోకూడదు

శీతాకాలంలో గుండెపోటు రాకుండా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రతను సాధారంగా ఉంచాలి. తలపై టోపీ, చేతులకు, పాదాలకు సాక్స్ లాంటి తొడుగులు పెట్టాలి. మంచినీటిని గోరువెచ్చని నీటినే తాగాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి గురికాకూడదు. వ్యాయామాలు చేయాలి.. శారీరక శ్రమను పెంచుతుండాలి. ఈ తరహా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే గుండెపోటు రాకుండా రక్షించుకోగలుగుతారు. ఎక్కువగా తీసుకునే మద్యం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండటంతోపాటు కాలేయం దెబ్బతింటుంది. ఏకాగ్రతను కోల్పోవడం, చేతులు, పాదాల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురవుతాయి. నరాల సమస్యలు కూడా వస్తాయి. ఒకేసారి మూడు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోకూడదు. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది.