Sunday, September 22, 2024
HomeUncategorizedశవాలను చూసి పారిపోవాలనుకున్నాను..

శవాలను చూసి పారిపోవాలనుకున్నాను..

Date:

వయనాడ్‌లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 200లకు పైగా దేహాలను బయటకు తీసినట్లు సమాచారం. దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

”ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేశా. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమయ్యింది. రెండోదాన్ని చూడలేకపోయా. అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదామనుకున్నా. కానీ, ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా” అని వయనాడ్‌ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు భావోద్వేగంతో వివరించారు.